: బంగ్లాపై విజయంతో టీమిండియా సాధించిన ఘనతలివే!


టీమిండియా వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టుపై 109 పరుగుల భారీ విజయం సాధించడంతో, ప్రపంచకప్ చరిత్రలో పలు ఘనతలు సాధించిన జట్టుగా తన పేరు లిఖించుకుంది. ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 11 మ్యాచుల్లో విజయం సాధించిన జట్టుగా నిలిచింది. అలాగే, ఒక వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లోపు 70 వికెట్లు పడగొట్టిన జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ ప్రపంచకప్ లో తొలిసారి బ్యాటింగ్ చేసిన ప్రతి మ్యాచ్ లో భారత జట్టు 300 పైచిలుకు లక్ష్యాన్ని నిర్దేశించిందని గణాంకాలు చెబుతున్నాయి. అలాగే, తాజా విజయంతో వన్డేల్లో 100 విజయాలు సాధించిన తొలి భారత కెప్టెన్ గా ధోనీ రికార్డులకెక్కాడు. కెప్టెన్ గా 177 మ్యాచులాడిన ధోనీ 100 విజయాలు నమోదు చేశాడు. అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లలో 3వ స్థానంలో ధోనీ నిలిచాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టు సెమీస్ చేరడం ఇది ఆరోసారి.

  • Loading...

More Telugu News