: ఆహా!... ఏం ఆట, ఏం ప్రదర్శన!: భారత్ విజయంపై మోదీ ట్వీట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీమిండియాకు అభినందనలు తెలిపారు. వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్లో నెగ్గి సెమీస్ చేరిన ధోనీ సేనపై ప్రశంసల వర్షం కురిపించారు. అద్భుతమైన ఆట, అద్భుతమైన ప్రదర్శన కనబర్చారని ట్విట్టర్లో కొనియాడారు. మెల్బోర్న్ లో మ్యాచ్ పూర్తయిన వెంటనే ఆయన భారత జట్టును ఉద్దేశించి ట్వీట్ చేశారు. కేంద్ర క్రీడల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కూడా జట్టును మెచ్చుకున్నారు. విలువైన సెంచరీతో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచిన రోహిత్ శర్మను అభినందించారు. అటు, కొత్తగా ఎన్నికైన బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ కూడా టీమిండియాను ప్రస్తుతించాడు. "అబ్బాయిలూ... బాగా ఆడారు" అంటూ ట్వీట్ చేశారు.