: పొట్ట చీల్చి శిశువును ఎత్తుకెళ్లాడు!


అమెరికాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొలరాడోలో ఓ గర్భవతి పొట్ట చీల్చి అందులో ఉన్న శిశువును ఎత్తుకెళ్లాడో వ్యక్తి. వివరాల్లోకెళితే... సదరు మహిళ ఆన్ లైన్ లో ఓ యాడ్ కు స్పందించింది. అది దుస్తులకు సంబంధించిన యాడ్. తన పుట్టబోయే బిడ్డకు దుస్తులు ముందుగానే కొనుగోలు చేయాలని భావించింది. ఆ యాడ్ కు సంబంధించిన వ్యక్తి మహిళకు ఇంటికి వచ్చాడు. ఆమె మాట్లాడుతుండగానే, అతడు కత్తితో విరుచుకుపడ్డాడు. దారుణంగా పొడిచి, ఆమె కడుపులో శిశువును ఎత్తుకెళ్లాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం వద్దకు వచ్చి చూడగా, రక్తపు మడుగులో మహిళ కనిపించింది. అప్పటికామె కొనఊపిరితో ఉంది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. కాగా, ఓ మృత శిశువుతో ఆసుపత్రిలో తిరుగుతున్న మహిళను పోలీసులు పట్టుకున్నారు. ఘటనకు ఆమెకు సంబంధం ఉందేమోనన్న కోణంలో ప్రశ్నిస్తున్నారు.

  • Loading...

More Telugu News