: స్పీకర్ కోడెలపై అవిశ్వాస నోటీసు ఇచ్చిన వైకాపా


ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ కార్యదర్శి సత్యనారాయణకు వైకాపా ఎమ్మెల్యేలు రవికుమార్, సురేష్, పుష్ప శ్రీవాణి తదితరులు ఈ నోటీసును అందజేశారు. ఈ నోటీసుపై పలువురు వైకాపా ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. తీర్మానంపై చర్చకు పిలిస్తే తప్ప తాను అసెంబ్లీకి రానని జగన్ ప్రకటించారు. అసెంబ్లీలో తాము మాట్లాడేందుకు స్పీకర్ మైక్ కూడా ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఈ రోజు సభ నుంచి వైకాపా వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం జగన్ తో పాటు, సస్పెండైన ఎమ్మెల్యేలంతా గవర్నర్ నరసింహన్ ను కలసి స్పీకర్ పై ఫిర్యాదు చేశారు.

  • Loading...

More Telugu News