: నవ్యాంధ్ర రాజధాని ప్రాంతంలో రూ. 600 కోట్ల పెట్టుబడి పెట్టనున్న 'ఫై డేటా సెంటర్స్'


యూఎస్ కేంద్రంగా ఐటీ సేవలందిస్తున్న 'ఫై డేటా సెంటర్స్' సంస్థ విజయవాడ పరిసరాల్లో రూ. 600 కోట్ల రూపాయల వ్యయంతో కార్యాలయాన్ని ప్రారంభించనుంది. 2016 ఏప్రిల్ లో ఈ సెంటర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని భావిస్తున్నట్టు సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ కల్యాణ్ ముప్పనేని తెలిపారు. మొత్తం 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే కార్యాలయానికి విద్యుత్ సరఫరా కోసం 60 మెగావాట్ల విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మించనున్నామని వివరించారు. ఇది దక్షిణ భారతావనిలో ప్రపంచస్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన మొట్టమొదటి టయర్-4 సర్టిఫైడ్ డేటా సెంటర్ కానుందని ఆయన పేర్కొన్నారు. 300 మందికి పైగా ప్రత్యక్షంగా, 2 వేల మందికి పైగా పరోక్షంగా ఉపాధిని కల్పించే ఈ సెంటర్ నుంచి 2018 నాటికి 100 మిలియన్ డాలర్ల (సుమారు రూ.610 కోట్లు) ఆదాయాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్టు కల్యాణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News