: ఆదిలోనే ఓపెనర్లను కోల్పోయిన బంగ్లాదేశ్... స్కోరు 33/2
ఇండియాతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ లో 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. కేవలం 33 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. ధాటిగా ఆడుతున్న తమీమ్ ఇక్బాల్ 25 (25 బంతులు, 4 ఫోర్లు) ఉమేష్ యాదవ్ బౌలింగ్ లో ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే మరో ఓపెనర్ ఇమ్రుల్ 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్ అయ్యాడు. దీంతో స్టేడియంలో ఉన్న బంగ్లాదేశ్ అభిమానులు ఒక్కసారిగా నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మహ్మదుల్లా, సౌమ్యా సర్కార్ క్రీజులో ఉన్నారు.