: భూసేకరణ బిల్లుపై బహిరంగ చర్చకు సిద్ధమా?... హజారే, సోనియాలకు గడ్కరీ సవాల్!
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భూసేకరణ బిల్లుపై అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తార స్థాయికి చేరింది. భూసేకరణ బిల్లుపై చర్చకు రావాలని నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా సదరు లేఖకు నేడు బీజేపీ కూడా అదే స్థాయిలో స్పందించింది. భూసేకరణ బిల్లుపై బహిరంగ చర్చకు తాము సిద్ధంగానే ఉన్నామని బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. మరి మీ సంగతేంటని ప్రశ్నిస్తూ ఆయన సోనియా, అన్నా హజారేలకు నేడు లేఖాస్త్రాలు సంధించారు.