: కర్ణాటక కోరితే సీబీఐ దర్యాప్తునకు రెడీ... ఐఏఎస్ అధికారి సూసైడ్ పై రాజ్ నాథ్ వ్యాఖ్య
కర్ణాటకలో అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు పాల్పడ్డ యువ ఐఏఎస్ అధికారి డీకే రవికుమార్ ఘటనపై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం సానుకూలంగా స్పందించింది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కోరితే సీబీఐ దర్యాప్తు జరిపించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపటి క్రితం పార్లమెంటులో ప్రకటించారు. రవి ఉదంతంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కర్ణాటక ప్రభుత్వాన్ని కోరిన సంగతి తెలిసిందే. నిజాయతీ కలిగిన యువ అధికారిగా పేరుగాంచిన రవి ఆత్మహత్య చేసుకున్న వైనంపై కర్ణాటక వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం రవికి లేదని, కొన్ని దుష్ట శక్తులే ఆయన ఆత్మహత్యకు కారణమని రవి కుటుంబం ఆరోపిస్తోంది.