: రోహిత్ అద్భుత ఆట... బంగ్లాదేశ్ విజయ లక్ష్యం 303
వరల్డ్ కప్ ను మరోసారి గెలవాలన్న కలను నేరవేర్చుకోవాలన్న లక్ష్యంతో బంగ్లాదేశ్ తో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడుతున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి 137 పరుగులు చేసి తస్కిన్ అహ్మద్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంతకుముందు ధావన్ 30, కోహ్లీ 3, రహనే 19, రైనా 65, ధోనీ 6 పరుగులు చేశారు. చివరి ఓవర్లలో జడేజా బంతిని పరుగులు పెట్టించాడు. కేవలం 10 బంతులను ఎదుర్కొన్న జడేజా 4 ఫోర్ల సాయంతో 23 పరుగులు చేశాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ కు 3, మోర్తాజా, రూబెల్, షకీబ్ లకు తలో వికెట్ లభించాయి. మరికాసేపట్లో 303 పరుగుల విజయ లక్ష్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ప్రారంభించనుంది.