: గుత్తి మోడల్ స్కూల్లో వికటించిన ఐరన్ మాత్రలు... 500 మంది విద్యార్థులకు అస్వస్థత
అనంతపురం జిల్లా గుత్తి లోని మోడల్ స్కూల్లో మాత్రలు వికటించిన ఘటన కలకలం రేపింది. పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు ఐరన్ మాత్రలు వికటించి అస్వస్థతకు గురయ్యారు. నేటి ఉదయం ఐరన్ మాత్రలు వేసుకున్న 500 మంది విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఒకేసారి పెద్ద సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో పాఠశాలలో కలకలం రేగింది. అస్వస్థతకు గురైన విద్యార్థులను మోడల్ స్కూల్ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులకు చికిత్స జరుగుతోంది.