: గవర్నర్ ముందుకు వైసీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం... సస్పెండైన ఎమ్మెల్యేలతో రాజ్ భవన్ కు జగన్


ఏపీ అసెంబ్లీలో వైసీపీ సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం రాజ్ భవన్ గడప తొక్కింది. కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో జరిగిన వ్యవహారాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, సస్పెండైన ఎమ్మెల్యేలతో కలిసి రాజభవన్ కు బయలుదేరారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో భేటీ కానున్న జగన్... నిన్న, నేడు సభలో జరిగిన వ్యవహారాలపై ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా స్పీకర్ కోడెల శివప్రసాద్ వ్యవహార సరళిపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. సభలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన స్పీకర్, అధికారపక్షం వైపు మొగ్గడమే కాక, తామేం మాట్లాడాలో కూడా ఆయనే నిర్దేశిస్తున్నారని జగన్, గవర్నర్ కు ఫిర్యాదు చేస్తారని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News