: రో'హిట్'... సెంచరీ... 42 ఓవర్లలో భారత్ స్కోర్ 229
బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీ సాధించాడు. మొత్తం 108 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 10 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 42 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 229 పరుగులు. మరో 8 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో స్కోర్ బోర్డు కనీసం 300 మార్కును దాటేలా చూడాలని ఇండియా భావిస్తోంది. 150 నుంచి 200 పరుగులు చేరేందుకు భారత ఆటగాళ్లు కేవలం 36 బంతులు మాత్రమే తీసుకున్నారు. రైనా 46 బంతుల్లో 50 పరుగులు చేశాడు.