: స్పీకర్ కు నమస్కారం పెట్టి వాకౌట్ చేసిన జగన్... స్పీకర్ తీరుపై అసహనం


ఏపీ అసెంబ్లీ నుంచి ప్రతిపక్ష వైసీపీ వాకౌట్ చేసింది. అధికార పక్షం చెప్పినట్లు సభను నడుపుతున్నారంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ కు నమస్కారం పెట్టి విసవిసా వెళ్లిపోయారు. సభ నుంచి బయటకు వెళుతున్న సమయంలో ఆయన స్పీకర్ వైపు చేయి చూపిస్తూ, ఇలా వ్యవహరించడం సరికాదంటూ వ్యాఖ్యానిస్తూనే ముందుకు సాగారు. 'సభను మీరే, మీ ఇష్టానుసారంగా నడుపుకోండి' అంటూ ఆయన వెళ్లిపోయారు. బయటకు వెళుతున్న సమయంలో, సభలోనే ఉండాలంటూ స్పీకర్ పలుమార్లు చేసిన విజ్ఞప్తిని జగన్ పట్టించుకోలేదు.

  • Loading...

More Telugu News