: నిదానించిన స్కోర్... 100 పరుగులు చేసేందుకు 155 బంతులు... రోహిత్ హాఫ్ సెంచరీ
బంగ్లాదేశ్ తో జరుగుతున్న ప్రపంచ కప్ క్రికెట్ పోరులో భారత జట్టు స్కోర్ నిదానంగా ముందుకు సాగుతోంది. 4 పరుగుల తేడాతో ధావన్, కోహ్లీ వికెట్లు కోల్పోయిన తరువాత రోహిత్, రహానేలు జాగ్రత్తగా ఆడుతున్నారు. 100 పరుగులు పూర్తి చేసేందుకు భారత ఆటగాళ్లు 155 బంతులు తిన్నారు. తొలి 50 పరుగులు 57 బంతుల్లో రాగా, తదుపరి 50 పరుగులు జోడించేందుకు 98 బంతులు అవసరం అయ్యాయి. ఈ క్రమంలో రోహిత్ హాఫ్ సెంచరీ చేశాడు. 70 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 4 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. రహానే 18 పరుగుల వద్ద కొనసాగుతున్నాడు. ప్రస్తుతం భారత్ స్కోర్ 27 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 108 పరుగులు.