: గెలవకుండానే పార్లమెంటులోకి వస్తున్న అతిథులు... రాజ్యసభలో నవ్వులు


తామంతా కష్టపడి ఎన్నికల్లో గెలిచి పార్లమెంటుకు వస్తుంటే ఇవి మాత్రం సరాసరి వచ్చి బాధిస్తున్నాయని ఎంపీలు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి రోజూ సాయంత్రం కాగానే దోమలు కుడుతున్నాయని, రాజ్యసభ సభ్యులు వాపోతున్నారు. "సార్, నాదొక చిన్న విన్నపం. సాయంత్రం అవగానే ఈ దోమలతో వేగలేకపోతున్నాం. వీటికి పొగలాంటిదేమైనా పెట్టాలి" అని జయాబచ్చన్ సభాపతి పి.జే.కురియన్ కు విన్నవించగా, ఆ వెంటనే మైనారిటీ వ్యవహారాల మంత్రి నజ్మాహెప్తుల్లా మైకు అందుకున్నారు. మేమంతా ఎన్నికల్లో గెలిచి ఇక్కడికి వస్తే అవి మాత్రం సరాసరి వచ్చేసి మమ్మల్ని బాధిస్తున్నాయని వివరించారు. మరో మంత్రి రవిశంకర్‌ ప్రసాద్ కల్పించుకొని, సభాపతే సభ్యులకు రక్షకుడు కాబట్టి మీరే ఈ దోమల నుంచి మమ్మల్ని కాపాడాలని కోరడంతో, రాజ్యసభలో నవ్వులు పూశాయి.

  • Loading...

More Telugu News