: ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి... పరుగులు పెట్టిన ప్రజలు
ప్రకాశం జిల్లాలో మరో మారు భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొద్దిసేపటి క్రితం జిల్లాలోని పలు మండలాల్లో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది. దీంతో ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు పరుగులు పెట్టారు. జిల్లా కేంద్రం ఒంగోలుతో పాటు చీమకుర్తి, అద్దంకి, కొరిశపాడు, పంగులూరు మండలాల్లో భూమి కంపించింది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. తరచుగా చోటుచేసుకుంటున్న భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.