: నడుంపై చేతులేసి, మోకాళ్లతో వెనక నుంచి తన్నుతూ... కేరళ అసెంబ్లీలో మహిళా సభ్యులపై ‘మగ’ ఎమ్మెల్యేల కీచక పర్వం


అనినీతి మంత్రి బడ్జెట్ ఎలా ప్రవేశపెడతారంటూ మొన్న కేరళ అసెంబ్లీలో విపక్ష సభ్యులు రణరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో అధికార, విపక్ష సభ్యుల మధ్య గొడవే మనకు తెలుసు. అంతకంటే ఆశ్చర్యకరమైన ఘటనలు జరిగాయని నిన్న తేలింది. నాటి ఘటనలో మహిళా సభ్యులపై ‘మగ’ ఎమ్మెల్యేలు కీచక పర్వానికి దిగారు. ఈ మేరకు నాటి ఘటనకు సంబంధించిన 141 ఫొటోలను విడుదల చేసిన మహిళా ఎమ్మెల్యేలు, తమ పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిమాండ్ చేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే శివదాసన్... తనను చేయి పట్టి లాగడమే కాక, మోకాళ్లతో వెనుక నుంచి తన్నారని మహిళా ఎమ్మెల్యే జమీలా ప్రకాశం ఆరోపించారు. తన నడుంపై శివదాసన్ చేతులేయగా, ఆయన పట్టు నుంచి విడిపించుకునేందుకు ఆయన చేతిని కొరకాల్సి వచ్చిందని కూడా ఆమె వాపోయారు. తమపై అనుచితంగా వ్యవహరించిన ‘మగ’ ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News