: ఆంధ్ర మీడియా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుంది... నమ్మొద్దు: కడియం
ఆంధ్ర మీడియా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఆంధ్ర మీడియా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తుందని, అలాంటివి ప్రజలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఇలాంటి సమయంలో ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించి, బంగారు తెలంగాణ సాకారం చేసుకోవాలని అన్నారు. ఇక, నిరుద్యోగులను చల్లబరిచేందుకన్నట్టు, ఈ ఏడాది అంతా ఉద్యోగ నియామకాలు ఉంటాయని కడియం శ్రీహరి తెలిపారు. ఉద్యోగాల జాతరగా అభివర్ణించారు.