: ఎంసీజీని త్రివర్ణమయం చేయండి: ఫ్యాన్స్ కు ధోనీ సూచన


టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చాడు. బంగ్లాదేశ్ తో గురువారం జరిగే క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కు వేదికైన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ను త్రివర్ణమయం చేయాలని సూచించాడు. ఈ మెగా టోర్నీలో మ్యాచ్ లకు భారీగా ప్రేక్షకులు తరలివస్తున్నారని, వారెంతో మద్దతిస్తున్నారని ధోనీ పేర్కొన్నాడు. ఇదే తరహా ప్రోత్సాహాన్ని మెల్బోర్న్ క్వార్టర్ ఫైనల్లోనూ చూపుతారని ఆశిస్తున్నట్టు తెలిపాడు. ఇక, మ్యాచ్ గురించి చెబుతూ, ఇరు జట్లలోనూ నాణ్యమైన ఆటగాళ్లున్నారని, ఉపఖండం జట్ల మధ్య అద్భుతమైన పోరు తప్పదని భావిస్తున్నట్టు తెలిపాడు. అటు, బంగ్లాదేశ్ స్టార్ ఆల్ రౌండర్ షకిబ్ అల్ హసన్ కూడా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తం చేశాడు. తమ అభిమానులు కూడా భారీ సంఖ్యలో స్టేడియంలో కనిపించాలని కోరుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News