: మీకు చేతనైతే వాస్తవాలు చూపించండి: రోజా సవాలు


టీడీపీకి చేతనైతే శాసనసభలో జరిగిన అన్ని సంఘటనల దృశ్యాలను బయటపెట్టాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా సవాలు విసిరారు. టీడీపీ విడుదల చేసిన వీడియో ఫుటేజ్ పై హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఎన్నుకుంటేనే తాము శాసనసభలో అడుగుపెట్టామని, ప్రజల కోసం పనిచేస్తున్నామని అన్నారు. సభలో జరిగిన ఘటనల వీడియోలన్నీ బయటపెడితే ఎవరు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారో వెల్లడవుతుందని ఆమె స్పష్టం చేశారు. శాసనసభలో జరిగిన వాస్తవ అంశాల వీడియోను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. పదేళ్లు టీడీపీలో కుక్కలా పని చేయించుకున్నప్పుడు, తన బాడీ లాంగ్వేజ్ లో కానీ, భాషా ప్రయోగంలో కానీ లోపం కనబడలేదా? అని ఆమె ప్రశ్నించారు. తాను ఎమ్మెల్యే అవడం ఇష్టం లేని టీడీపీ నేతలు, విషయపరిజ్ఞానమున్న తనను ఎదుర్కోలేక ఎడిట్ చేసిన వీడియో ఫుటేజ్ ను విడుదల చేశారని, తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆమె తెలిపారు.

  • Loading...

More Telugu News