: అరుదైన ఘటన... ఛాతీ బయట గుండెతో పాప జననం


మధ్యప్రదేశ్ లోని డిండోరీలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. డిండోరీకి చెందిన గర్భిణి సుష్మ (22)కు జబల్ పూర్ లోని ఓ ఆసుపత్రిలో ప్రసవం అయింది. జన్మించిన పాప అందరిలా కాకుండా, ఛాతీ బయట గుండెతో జన్మించింది. ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా చోటుచేసుకుంటాయని వైద్యులు తెలిపారు. దీనిని వైద్య పరిభాషలో 'ఎక్టోపియా కార్డిక్స్' అంటారని జబల్ పూర్ ఆసుపత్రి వైద్యుడు జీకే సమద్ అన్నారు. పాప గుండె ఛాతీ బయట ఉన్నప్పటికీ మామూలుగానే కొట్టుకుంటోందని చెప్పారు. అయితే, గుండె ఇలా ఎక్కువసేపు బయట ఉంటే ప్రమాదమని, తక్షణం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఈ ఆపరేషన్ కు తగిన సౌకర్యాలు తమ ఆసుపత్రిలో లేనందున ప్రభుత్వాసుపత్రికి పంపించామని ఆయన చెప్పారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పాపను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.

  • Loading...

More Telugu News