: అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చాం: లంక కెప్టెన్
క్వార్టర్ ఫైనల్ లో దక్షిణాఫ్రికా చేతిలో దారుణ పరాభవం చూసిన అనంతరం శ్రీలంక కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ మీడియాతో మాట్లాడాడు. కీలక మ్యాచ్ లో అత్యంత చెత్త ప్రదర్శన కనబర్చామని అభిప్రాయపడ్డాడు. పిచ్ దారుణంగా ఏమీ లేదని, కనీసం 250 పరుగులు చేసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. తద్వారా బౌలర్లకు అవకాశం ఉండేదని పేర్కొన్నాడు. భారీ షాట్లు ఆడలేకపోయామన్నాడు. ఇక, దిగ్గజాలు జయవర్థనే, సంగక్కరలకు మధుర స్మృతిని అందిద్దామనుకుంటే, మ్యాచ్ లో ఓటమిపాలవడం అసంతృప్తిని కలిగించిందని అన్నాడు. వారి విశేష సేవలకు శ్రీలంక ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నాడు. "ఏళ్లుగా వారు జట్టు కోసం పాటుపడ్డారు. వారికోసం ఫైనల్ చేరి కప్ గెలుద్దామని అనుకున్నాం. దురదృష్టవశాత్తు అలా చేయలేకపోయాం. వారి ముఖాల్లో నవ్వు చూసేందుకు ఏదో ఒకటి చేయాలి" అన్నాడు.