: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు బెయిల్
సీపీఐ ఏపీ కార్యదర్శి కె.రామకృష్ణకు అనంతపురం కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనతో పాటు అరెస్టైన జిల్లా నేతలు ఏడుగురికి కూడా బెయిల్ లభించింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ అనంతపురంలో సీపీఐ పార్టీ ఆందోళన నిర్వహించింది. ఈ సమయంలో స్థానిక టెలికాం, ఇతర దుకాణాలపై దాడికి పాల్పడడం వంటి ఘటనలు జరిగాయి. అనంతపురం పోలీస్ స్టేషన్ లో నిరసన తెలుపుతున్న సమయంలో రామకృష్ణను, పార్టీ నేతలను అరెస్టు చేశారు. కాగా, స్థానిక కోర్టు ఆయనకు మంగళవారం బెయిల్ నిరాకరించిన సంగతి విదితమే.