: గుడివాడలో కాదు... ఎక్కడైనా సరే తేల్చుకుందాం: బొండా ఉమకు కొడాలి నాని సవాల్


ఇవాళ్టి ఏపీ అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించాయి. అధికార, ప్రతిపక్ష సభ్యులు విమర్శలు, ప్రతివిమర్శలు... సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతుండగా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనకూడని మాటేదో అన్నారు. దీంతో, కొడాలి నానిని ఉద్దేశించి... "రేయ్ ఏంట్రా, అసెంబ్లీలోనే పాతేస్తా"నంటూ ఉమ హెచ్చరించారు. సభ వాయిదా పడిన అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ, తన నియోజకవర్గం గుడివాడలోనే కాదు, ఎక్కడైనా తేల్చుకుందాం రా... అంటూ ఉమకు సవాల్ విసిరారు. "చంద్రబాబు రాసిచ్చిన స్లిప్పులు చదవడం, చట్టసభల్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే నీ పని" అంటూ బొండాను ఉద్దేశించి అన్నారు. అంతేకాకుండా, బొండా ఉమ, చంద్రబాబులు రాష్ట్రానికి శనిలా దాపురించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News