: 50 యూనిట్ల లోపు వినియోగించే దళిత కుటుంబాలకు ఉచిత కరెంట్: హరీష్ రావు
తెలంగాణలో నివసించే దళిత కుటుంబాలకు మంత్రి హరీష్ రావు ఆఫర్ ప్రకటించారు. 50 యూనిట్లలోపు కరెంటు వినియోగించే వారికి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ ఒకటి నుంచి హాస్టల్ విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు పెంచుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు మీడియాతో ఆయన మాట్లాడుతూ పైవిషయాలు వివరించారు. దళితుల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ భవనం ఆధునికీకరణకు రూ.10 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు.