: మంత్రి అజంఖాన్ పై ఫేస్ బుక్ లో విద్యార్థి కామెంట్లు... అరెస్టు


అప్పుడప్పుడు తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ కలకలం సృష్టించే ఉత్తరప్రదేశ్ మంత్రి అజంఖాన్ పై ఫేస్ బుక్ లో ఓ కుర్రాడు అమర్యాదకరమైన వ్యాఖ్యలు పోస్టు చేశాడు. దాంతో అతడిని పోలీసులు అరెస్టు చేసి జైల్లో వేశారు. రాయ్ బరేలీ జిల్లాలో ఉన్న ఉడ్ రో పాఠశాలలో 11వ తరగతి చదువుకుంటున్నాడని, పేరు విక్కీ ఖాన్ అని రాంపూర్ పోలీసులు తెలిపారు. యువకుడి ఫేస్ బుక్ వ్యాఖ్యలపై మంత్రి మీడియా ఇన్ ఛార్జ్ ఫసహత్ అలీ ఫిర్యాదు చేయడంతో... సెక్షన్ 66 ఎ కింద కేసు పెట్టామన్నారు. తరువాత అతడిని కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని, ప్రస్తుతం అతను జిల్లా జైలులో ఉన్నాడని పోలీసులు వివరించారు. మంత్రి పేరుతో అసత్య ప్రచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, హిందూ ముస్లింల మనోభావాలను ఆ వ్యాఖ్యలు దెబ్బతీశాయన్నారు. అజంఖాన్ పరువుకు భంగం వాటిల్లిందన్నారు.

  • Loading...

More Telugu News