: నిర్భయ కేసు పెట్టలేదని నాగార్జునసాగర్లో దూకి యువతి ఆత్మహత్య
ఇటీవల హైదరాబాదు ఎల్బీనగర్ ఆంజనేయస్వామి ఆలయ చైర్మన్ గుంటి రాజేశ్ తనను మోసగించాడని ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆ ఘటనపై పోలీసులు సాధారణ కేసు నమోదు చేసినట్టు సమాచారం. అతడిపై నిర్భయ కేసు పెడతారని ఆమె ఆశించింది. అందుకు విరుద్ధంగా జరగడంతో బాధిత యువతి తీవ్ర మనస్తాపానికి లోనైంది. పోలీసులు తన గోడును వినలేదని భావించి, బుధవారం నాగార్జునసాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు ఓ సూసైడ్ నోట్ రాసి బలవన్మరణం చెందింది.