: ఎద్దు మాంసంపై నిషేధం పట్ల రిషి కపూర్ ఆగ్రహం... మతంతో ఆహారాన్ని ఎందుకు ముడిపెడతారని ప్రశ్న


మహారాష్ట్ర ప్రభుత్వం ఎద్దు మాంసంపై ఇటీవల నిషేధం విధించడంపై బాలీవుడ్ సీనియర్ నటుడు, హీరో రణబీర్ కపూర్ తండ్రి రిషికపూర్ తాజాగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మతంతో ఆహారాన్ని ఎందుకు ముడిపెడతారంటూ ట్విట్టర్ లో ప్రశ్నించారు. "నేను చాలా కోపంగా ఉన్నాను. ఆహారాన్ని మతంతో ఎందుకు ముడిపెడతారు? నేను ఎద్దు మాంసం తినే హిందువును. అంటే నాకు భక్తి లేదనా?... ఆలోచించండి" అని రిషి కపూర్ ట్వీట్ చేశారు. ఈ విషయంలో తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని, తాను జంతువులను చంపడాన్ని సమర్థించడం లేదని రిషి వివరించారు.

  • Loading...

More Telugu News