: వైట్ హౌస్ కార్యాలయానికి సైనేడ్ పూసిన ఎన్వలప్


అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కార్యాలయానికి వచ్చిన ఓ కవర్ ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ వారంలో వచ్చిన ఓ కవర్ 'సైనేడ్ పాజిటివ్' అని తేలినట్టు యూఎస్ మీడియా తెలిపింది. "ఈ నెల 16/03/2015న వైట్ హౌస్ లేఖల పరిశీలన విభాగానికి ఓ ఎన్వలప్ కవర్ వచ్చింది. ప్రాథమిక బయోలాజికల్ పరీక్షలో నెగిటివ్ అని తేలింది. మళ్లీ తరువాత రోజున రసాయన పరీక్షలో సైనేడ్ పాజిటివ్ అని స్పష్టమైంది" అని సీక్రెట్ సర్వీస్ అధికార ప్రతినిధి బ్రియాన్ లియరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రిజల్ట్ ను ధ్రువీకరించుకునేందుకు అదే శాంపిల్ ను మరో చోటకు పంపామని చెప్పారు. దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News