: మురళీధరన్ మాట విన్నారు... పరాజయం బాట పట్టారు!


ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్లో శ్రీలంక పరాజయం బాట పట్టింది. స్వల్ప స్కోరుకే చాప చుట్టేసిన లంకేయులు, మ్యాచ్ ను చేజేతులా సఫారీలకు అప్పగించేశారు. 133 పరుగులకే ఆలౌటైన లంక, సఫారీలకు సునాయాస విజయాన్ని అందించనుంది. దీనికంతటికీ లంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ కారణమన్న వాదన వినిపిస్తోంది. నాకౌట్ దశకు చేరిన జట్టుకు నిన్న మురళీధరన్ ఓ సలహా ఇచ్చాడు. టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోండని మాథ్యూస్ సేనకు సూచించాడు. మురళీధరన్ సూచన మేరకే మాథ్యూస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇదే తమ కొంపముంచిందని ప్రస్తుతం ఆ జట్టు సభ్యులతో పాటు ఆ దేశ క్రికెట్ అభిమానులు లోలోపల మధనపడుతున్నారు.

  • Loading...

More Telugu News