: లారీ ఢీకొని డిగ్రీ విద్యార్థిని మృతి... లారీని తగులబెట్టిన స్థానికులు
కళాశాలకు వెళ్లిన డిగ్రీ విద్యార్థిని ఇంటికొస్తున్న క్రమంలో లారీ ఢీకొని మృత్యువాత పడింది. దీంతో ఆగ్రహించిన స్థానికులు లారీపై దాడి చేసి దానిని అగ్నికి ఆహుతి చేశారు. దీంతో నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మండలంలోని కాకర్లపాడు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో విద్యార్థిని సంధ్య, తన తండ్రితో కలిసి వెళుతున్న బైక్ ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో సంధ్య అక్కడికక్కడే మరణించగా, ఆమె తండ్రికి గాయాలయ్యాయి.