: హైకోర్టు విభజనకు కేసీఆర్ తీర్మానం... మద్దతు తెలిపిన విపక్షాలు
రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టును కూడా విభజించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ న్యాయవాదుల ఆందోళనలపై కేసీఆర్ సర్కారు స్పందించింది. నేటి అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా, హైకోర్టును విభజించాలంటూ సీఎం కేసీఆర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కేసీఆర్ ప్రతిపాదించిన తీర్మానానికి సభలోని విపక్షాలన్నీ మద్దతు పలికాయి. దీంతో కేసీఆర్ తీర్మానానికి ఏకగ్రీవ ఆమోదం లభించింది. తక్షణమే హైకోర్టు ను విభజించాలన్న సదరు తీర్మానాన్ని అమోదించిన తెలంగాణ అసెంబ్లీ, కేంద్రానికి పంపింది.