: తొలి వికెట్ కోల్పోయిన సౌతాఫ్రికా


శ్రీలంకతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ లో 134 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా జట్టు విజయం వైపు దూసుకుపోతోంది. ఓపెనర్లు ఆమ్లా, డి కాక్ లు 6.4 ఓవర్లలో 40 పరుగులు చేశారు. ఈ క్రమంలో మలింగ బౌలింగ్ లో 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆమ్లా ఔట్ అయ్యాడు. ఆమ్లా కొట్టిన ఓ భారీ షాట్ ను డీప్ థర్డ్ మెన్ వద్ద కులశేఖర డైవ్ చేసి అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా తొలి వికెట్ కోల్పోయింది. వెంటనే అంపైర్లు లంచ్ బ్రేక్ ప్రకటించారు. తక్కువ ఓవర్లలోనే శ్రీలంక ఔట్ కావడంతో, ముందుగానే సౌతాఫ్రికా బ్యాటింగ్ కు దిగిన సంగతి తెలిసిందే. సెమీ ఫైనల్స్ చేరడానికి సౌతాఫ్రికా మరో 43.2 ఓవర్లలో 94 పరుగులు చేయాల్సి ఉంది. మరో 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. దీంతో, సఫారీలు సెమీస్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News