: శ్రీలంక ఆలౌట్... సౌతాఫ్రికా లక్ష్యం 134... వెంటనే దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభం


ప్రపంచకప్ హాట్ ఫేవరెట్లలో ఒకటిగా పరిగణించబడ్డ శ్రీలంక జట్టు ప్రయాణం క్వార్టర్ ఫైనల్లోనే ముగియనుంది. సిడ్నీలో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్స్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక... తగిన మూల్యం చెల్లించుకుంది. కేవలం 133 పరుగులకే ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభం అయినప్పటి నుంచి క్రమం తప్పకుండా లంక బ్యాట్స్ మెన్ పెవిలియన్ బాట పట్టారు. చాలామంది బ్యాట్స్ మెన్ పెవిలియన్ చేరడానికి, క్రీజులోకి వచ్చినంత సమయం కూడా పట్టలేదు. శ్రీలంక బ్యాట్స్ మెన్లలో పెరీరా 3, దిల్షాన్ 0, సంగక్కర 45, తిరిమన్నే 41, జయవర్ధనే 4, మ్యాథ్యూస్ 19, పెరీరా 0, కులశేఖర 1, కౌశాల్ 0, చమీరా 2 నాటౌట్, మలింగ 3 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఇమ్రాన్ తాహిర్ 4, డుమిని 3, స్టెయిన్, అబ్బాట్, మోర్కెల్ చెరో వికెట్ తీశారు. ఇందులో డుమిని హ్యాట్రిక్ నమోదు చేయడం విశేషం. శ్రీలంక బ్యాట్స్ మెన్ లలో ముగ్గురు డకౌట్ కావడం విశేషం. శ్రీలంక ఇన్నింగ్స్ 37.2 ఓవర్లలోనే ముగియడంతో... వెంటనే సౌతాఫ్రికా బ్యాటింగ్ ప్రారంభించింది. ఓపెనర్ ఆమ్లా ఇన్నింగస్స్ తొలి బంతినే బౌండరీకి తరలించి శ్రీలంకకు హెచ్చరికలు పంపాడు.

  • Loading...

More Telugu News