: సంగక్కర ఔట్... వెంటనే వర్షం మొదలు
ప్రపంచకప్ తొలి క్వార్టర్ ఫైనల్స్ దక్షిణాఫ్రికా, శ్రీలంకల మధ్య కొనసాగుతోంది. సౌతాఫ్రికా బౌలర్ల ప్రతాపానికి లంక బ్యాట్స్ మెన్ నిలువలేక, పెవిలియన్ కి క్యూ కట్టారు. టాప్ స్కోరర్ సంగక్కర 45 పరుగుల (96 బంతులు, 3 ఫోర్లు) వద్ద మోర్కెల్ బౌలింగ్ లో మిల్లర్ క్యాచ్ పట్టడంతో తొమ్మిదవ వికెట్ రూపంలో ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో, సంగక్కర నిరాశతో పెవిలియన్ కు నడుస్తున్న సమయంలో జోరుగా వాన పడటం ప్రారంభమయింది. ప్రస్తుతానికి వర్షం ఆగింది. ఏ క్షణంలో అయినా ఆట ప్రారంభమయే అవకాశం ఉంది.