: వైఎస్ రైతు ద్రోహి: మంత్రి రావెల కిశోర్ బాబు ఆరోపణ
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు ఘాటు విమర్శలు గుప్పించారు. వైఎస్ రాజశేఖరరెడ్డిని రైతు ద్రోహిగా ఆయన అభివర్ణించారు. నేటి అసెంబ్లీ సమావేశాల్లో జగన్ అధికార పక్షంపై ఆరోపణలు గుప్పించగా, అందుకు ప్రతిగా ఎదురుదాడికి దిగిన అధికార పక్షం, జగన్ పై ముప్పేట దాడి చేసింది. ప్రాజెక్టుల పేరిట ధనార్జన చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి ముమ్మాటికీ రైతు ద్రోహేనంటూ రావెల వ్యాఖ్యానించారు. దీంతో సభలో కలకలం రేగింది. అధికార పక్షం వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు.