: వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ... ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు!


ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరల పెరుగుదలపై వాయిదా తీర్మానాన్ని ప్రతిపక్ష వైసీపీ ప్రతిపాదించింది. అయితే, దీనిని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. అనంతరం ఆయన ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వాయిదా తీర్మానాలపై చర్చ కోసం నిన్నటిదాకా పట్టుబట్టిన వైసీపీ నేడు మాత్రం కొంత సంయమనం పాటించింది. నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో అధికార పక్షం ఆగ్రహావేశాల నేపథ్యంలో ప్రతిపక్షం కాస్త వెనక్కు తగ్గినట్లు కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News