: అంపైర్లు ఏం మాట్లాడతారో టీవీలో వినొచ్చు!
నిర్ణయ సమీక్ష విధానం (డీఆర్ఎస్) అమల్లోకి వచ్చాక అంపైర్లు థర్డ్ అంపైర్ తో వాకీటాకీల్లో చర్చించడం టీవీల్లో చూస్తుంటాం. అయితే, వారేం మాట్లాడుకుంటారో మనకు తెలిసే వీల్లేదు ఇప్పటివరకు. అయితే, వరల్డ్ కప్ నాకౌట్ దశలో మాత్రం అంపైర్ల మధ్య సంభాషణలు వినొచ్చు. ఈ మేరకు ఐసీసీ మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా వరల్డ్ కప్ ప్రసారకర్తలకు అంపైర్ల సంభాషణల తాలూకు లైవ్ ఆడియో అందుబాటులోకి వస్తోంది. అది టీవీల్లో మ్యాచ్ లు చూసే ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహంలేదు. ఈ పద్ధతిని 2014లో ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు.