: అమితాబ్ పై అభిమాని అలక


బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ అభిమాని విషయంలో విచారం వ్యక్తం చేశారు. అమిత అనే అభిమానికి బర్త్ డే తర్వాతి రోజు ట్విట్టర్లో విషెస్ చెప్పానని, అందుకు ఆమె అలకబూనిందని తెలిపారు. "అమిత నా ట్విట్టర్ ఫాలోవర్. ఈ నెల 15న ఆమె జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెప్పలేదని అప్ సెట్ అయింది. అందుకు క్షమాపణలు చెబుతున్నా. డిఫరెంట్ టైమ్ జోన్ లో ఉన్నప్పుడు శరీర స్పందనల్లో ఎన్నో మార్పులు వస్తాయి. విషెస్ చెప్పనందుకు నిరసనగా, ఆమె తనను ఫాలోవర్ గా తొలగించాలని పేర్కొంది. అసలు, వీళ్ల అలకలు నేనెందుకు భరించాలి? ఆ అవసరం నాకేముంది? అనిపిస్తుంది. కానీ, సంఘజీవనంలో విస్తృత ప్రయోజనాల రీత్యా అందరినీ కలుపుకుపోవడం తప్పదు" అని పేర్కొన్నారు. అమితాబ్ ఇటీవలే లండన్ లో గాంధీ విగ్రహావిష్కరణకు వెళ్లిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News