: ఆయుధాల దిగుమతిలో భారతే టాప్


ప్రపంచంలో ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్ నంబర్ వన్ అని స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ (ఎస్ఐపీఆర్ఐ) తెలిపింది. చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా దేశాలను వెనక్కి నెట్టి మరీ భారత్ ఈ ఘనత సాధించిందని ఎస్ఐపీఆర్ఐ పేర్కొంది. ప్రపంచంలో దిగుమతి అవుతున్న ఆయుధాల్లో 15 శాతం ఆయుధాలను భారత్ కొనుగోలు చేస్తోందని ఆ సంస్థ వెల్లడించింది. ఇన్ని ఆయుధాలను దిగుమతి చేసుకుంటున్నప్పటికీ భారత్ కొన్ని దేశాల కంటే తక్కువ ఆయుధసంపత్తి కలిగి ఉందని ఆ సంస్థ స్పష్టం చేసింది. భారత్ ఆయుధ దిగుమతుల్లో టాప్ గా నిలవడం ఇది మూడోసారని ఎస్ఐపీఆర్ఐ వెల్లడించింది.

  • Loading...

More Telugu News