: వైసీపీ ఎమ్మెల్యే ఫేస్ బుక్ అకౌంట్లో అశ్లీల చిత్రాలు... పట్టుబడిన నిందితుడు


హ్యాకింగ్ ఘటనలు ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వ వెబ్ సైట్లు, సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు హ్యాకర్లు. తాజాగా, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైసీపీ నేత కిలివేటి సంజీవయ్య ఫేస్ బుక్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఆయన ఖాతాలో అశ్లీల చిత్రాలు పోస్టు చేశారు. దీంతో, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు వెంటనే రంగంలోకి దిగారు. కొన్ని గంటల్లోనే నిందితుడు మునిస్వామిని అరెస్టు చేశారు. నిందితుడు ఓ ఐరన్ కంపెనీలో పనిచేస్తున్నాడని, ఎమ్మెల్యే ఫేస్ బుక్ అకౌంట్లో అశ్లీల చిత్రాలు పోస్టు చేసింది అతడేనని తేలిందని సీఐ విజయకృష్ణ తెలిపారు.

  • Loading...

More Telugu News