: నా దగ్గర 35 బైకులున్నాయి... 380 సీసీ రాజ్ దూత్ బైకంటే అభిమానం :ధోనీ


వరల్డ్ కప్ లో బిజీగా ఉన్న టీమిండియా కెప్టెన్ ధోనీ బైకుల గురించి ఎందుకు మాట్లాడాడా? అని అనుకుంటున్నారా? ప్రపంచకప్ కు ముందు స్టార్ స్పోర్ట్స్ టీవీ ఛానెల్ ధోనీతో చిన్నపిల్లల ఇష్టాగోష్టి కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ చిచ్చరపిడుగు మీకు బైకులంటే ఇష్టం కదా? మీ దగ్గర ఎన్ని బైకులు ఉన్నాయని అడిగాడు. దీనికి ధోనీ సమాధానమిస్తూ, తన దగ్గర 35 బైకులు ఉన్నాయని అన్నాడు. వివిధ కంపెనీలకు చెందిన, వివిధ మోడళ్ల బైకులు ఉన్నాయని అన్నాడు. స్పోర్ట్స్ బైకులు తనకు అంతగా సౌకర్యవంతంగా ఉండవని అన్నాడు. వాటన్నింటిలో రాజ్ దూత్ 380 సీసీ కెపాసిటీ బైక్ ఒకటి ఉందని, అదంటే వల్లమాలిన అభిమానం అని ధోనీ తెలిపాడు. దానిపై హెల్మెట్ పెట్టుకుని తిరిగేస్తానని ధోనీ చెప్పాడు. దానిమీద వెళ్తుంటే ఎవడ్రా విచిత్రమైన పాతకాలం బైక్ మీద వెళ్తున్నాడని అనుకుంటారని, అది చేసే పెద్ద శబ్దం కారణంగా అక్కడితో ఆగిపోతారని తెలిపాడు. అదే స్పోర్ట్స్ బైక్ పై వెళ్తే అంతా చూస్తారని, అది తనకు నచ్చదని ధోనీ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News