: కేసీఆర్ చెప్పినట్టు చేసుంటే భద్రాచలం కూడా ఏపీలోకి వెళ్లుండేది: షబ్బీర్ అలీ
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం రాదని టీకాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. ఉద్యమ సమయంలో కూడా లెక్కలేనన్ని అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. ముంపు మండలాలను ఏపీలో విలీనం చేసుకోవడానికి వీలుగా శ్రీకృష్ణ కమిటీకి కేసీఆర్ లేఖ ఇచ్చారని... ఆయన చెప్పినట్టు చేసుంటే భద్రాచలం కూడా ఏపీలోకి వెళ్లుండేదని చెప్పారు. ఈ మేరకు టీఆర్ఎస్ రాసిన లేఖను మీడియా ప్రతినిధులకు అలీ చూపించారు. తప్పు చేసింది కేసీఆరే కాబట్టి, ముంపు మండలాలపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లడం లేదని ఆరోపించారు.