: కేసీఆర్ తో కుమ్మక్కయింది జగనే: గోరంట్ల


తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కుమ్మక్కయింది విపక్ష నేత జగనే అని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. కేసీఆర్ తో కుమ్మక్కైన జగన్ ఏపీలో అభివృద్ధికి ప్రతిబంధకంలా మారారని మండిపడ్డారు. జగన్ గూండాయిజం చేస్తున్నారని, అందరినీ ఏకవచనంలో పిలుస్తూ మర్యాదలు పాటించడం లేదని విమర్శించారు. నీచ రాజకీయాలకు పాల్పడుతూ రాయలసీమకు నీరందకుండా చేస్తోంది జగనే అన్నారు. పట్టిసీమ ప్రాజెక్టుకు అడ్డుతగులుతున్నాడని ఆరోపించారు. కాగా, కేసీఆర్ తో ఏపీ సీఎం చంద్రబాబు కుమ్మక్కయ్యారని జగన్ ఇంతకుముందు వ్యాఖ్యానించడం తెలిసిందే.

  • Loading...

More Telugu News