: హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ పుంజుకుంటోంది: కేసీఆర్
హైదరాబాదులో ఇప్పుడిప్పుడే రియల్ ఎస్టేట్ బూమ్ పుంజుకుంటోందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెలిపారు. నగరం చుట్టు పక్కల 10 వేల ఎకరాల అసైన్డ్ భూములు అన్యాక్రాంతమయ్యాయని... కబ్జాకు గురయ్యే అవకాశం ఉన్న భూములను అమ్మేస్తామని అసెంబ్లీలో వెల్లడించారు. భూముల అమ్మకం వద్దని కాంగ్రెస్ సభ్యులు అనడంతో... భూములను అమ్మే సంస్కృతి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే వచ్చిందని... తాము అమ్మితే తప్పా? అని ప్రశ్నించారు. ఇక, ఈసారి రూ. 96 వేల కోట్ల ప్రభుత్వ రాబడి కచ్చితంగా ఉంటుందని కేసీఆర్ చెప్పారు. వాటర్ గ్రిడ్ కోసం దాదాపు రూ. 33 వేల కోట్లు ఖర్చవుతాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాల్లో కోతలు విధించిందని అన్నారు.