: కేసీఆర్ తో కుమ్మక్కయింది చంద్రబాబే: జగన్
ఏపీ శాసనసభ సమావేశాలు చాలా దారుణంగా కొనసాగుతున్నాయని, సమస్యలను లేవనెత్తుతున్న తమ గొంతు నొక్కేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు. అంగన్ వాడీ వర్కర్ల సమస్యలు, పట్టిసీమ గురించిన చర్చను ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు. పట్టిసీమ వల్ల పోలవరం భవిష్యత్తు అంధకారమవుతుందని అన్నారు. తమ వాదన వినే ఓపిక ప్రభుత్వానికిగానీ, స్పీకర్ కు కానీ లేదని ఆరోపించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో తాను కుమ్మక్కయ్యానని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారని... వాస్తవంగా చెప్పాలంటే, కేసీఆర్ తో కుమ్మక్కయింది చంద్రబాబే అని జగన్ మండిపడ్డారు. టీడీపీ తీరును మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు.