: చెన్నై ఎయిర్ పోర్టును వెనక్కినెట్టిన బెంగళూరు విమానాశ్రయం


దేశంలో అత్యంత రద్దీ విమానాశ్రయాల జాబితాలో చెన్నైని బెంగళూరు వెనక్కి నెట్టింది. ఇప్పటిదాకా మూడోస్థానంలో ఉన్న చెన్నై తాజాగా తన స్థానాన్ని బెంగళూరుకు కోల్పోయింది. ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ గణాంకాలను విడుదల చేసింది. తమిళనాడులో ఆర్థిక కార్యకలాపాలు మందగించడమే చెన్నై ఎయిర్ పోర్టులో రద్దీ తగ్గడానికి కారణమని అర్థమవుతోంది. రద్దీ విషయంలో ఢిల్లీ, ముంబయి విమానాశ్రయాలు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. బెంగళూరు గత రెండేళ్లుగా దేశీయ ప్రయాణికుల విషయంలో చెన్నై కంటే ముందంజలోనే ఉంది. ఇప్పుడు ఓవరాల్ (దేశీయ, అంతర్జాతీయ) ప్రయాణికుల విషయంలోనూ ముందుకు దూసుకెళ్లింది. 2014 ఏప్రిల్ నుంచి 2015 జనవరి వరకు ఈ విషయంలో బెంగళూరు 17.7 శాతం పురోగతి కనబర్చగా, అదే సమయంలో చెన్నై 10.5 శాతం మాత్రమే పురోగతి కనబర్చింది. సరకు రవాణా అంశంలోనూ బెంగళూరు విమానాశ్రయం పైచేయి చాటుకుంది. దీనిపై చెన్నై ఎయిర్ పోర్టు డైరెక్టర్ దీపక్ శాస్త్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఆర్థిక, పారిశ్రామిక సంబంధ పురోగతి కుంటుపడిందనడానికి ఇది సూచిక అని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News