: వాణిజ్యపన్నుల శాఖలో అతినీతి తిమింగలం... లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన విశాఖ ఏసీటీవో


వాణిజ్యపన్నుల శాఖలో మరో అతినీతి తిమింగలాన్ని అవినీతి నిరోధక శాఖ పట్టేసింది. విశాఖలో అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కిశోర్ కుమార్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. లంచాల కోసం వేధిస్తున్న అతడిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు కిశోర్ కుమార్ ను పట్టుకునేందుకు వల పన్నారు. బాధితుల నుంచి రూ.50 వేల లంచం తీసుకుంటున్న ఆయనను కొద్దిసేపటి క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

  • Loading...

More Telugu News