: తల్లికోసం నటి శ్రద్ధాకపూర్ కచేరీ


బాలీవుడ్ అందాలభామ శ్రద్ధాకపూర్ మంచి నటిగానే కాకుండా గాయనిగానూ నిరూపించుకుంది. స్వతహాగా గాయని అయిన తన తల్లి శివాంగి నుంచే ఈ టాలెంట్ ను పుణికి పుచ్చుకుంది. ఇటీవల తల్లి పుట్టినరోజు సందర్భంగా శ్రద్ధా సర్ ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేసిందట. ఒక్క కేక్ కటింగే కాకుండా అందరూ ఆశ్చర్యపోయేలా పాటల కచేరీ కూడా నిర్వహించి, తను కూడా పాడి అబ్బురపరిచిందట. "తన తల్లి పుట్టినరోజు నాడు ప్రత్యేకంగా ఏదో ఒకటి చేసి గిఫ్ట్ గా ఇవ్వాలని శ్రద్ధా అనుకుంది. దాంతో ముంబయిలోని జుహులో ఉన్న ఇంటిలో కచేరీతో బర్త్ డే పార్టీ ఏర్పాటు చేసింది. తల్లి స్నేహితులను, కుటుంబ సభ్యులను పిలిచింది. సంగీతమన్నా, పాడటమన్నా ఎంతో ఇష్టపడే శ్రద్ధా తల్లి మంచి గాయని కూడా. దాంతో ఆ రోజు రాత్రంతా సంగీతం, పాటలతో అంతా బాగా ఎంజాయ్ చేశారు" అని శ్రద్ధా సన్నిహితులొకరు వెల్లడించారు. ఆ సర్ ప్రైజ్ పార్టీతో అమ్మడి తల్లి చాలా సంతోషించిందట.

  • Loading...

More Telugu News