: ఆ ముగ్గురి వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం: యనమల


కేంద్ర మాజీ మంత్రులు చిదంబరం, షిండే, వీరప్ప మొయిలీల వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిందని మంత్రులు యనమల రామకృష్ణుడు, పల్లె రఘునాథరెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఆ ముగ్గురు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి గడ్డు పరిస్థితులు తెచ్చారని వారు విమర్శించారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీది రెండు నాల్కల ధోరణి అని మరోసారి రుజువైందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని విభజన చట్టంలో పెట్టకుండా, ప్రకటన మాత్రమే చేసి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకం మొదలు పెట్టిందని, దీనిపై కాంగ్రెస్ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థిక కష్టాల్లో ఉన్నందున ఎమ్మెల్యేలకు ఇప్పట్లో జీతాలు పెంచే ఆలోచన లేదని వారు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News